ఆంధ్రవిశ్వవిద్యాలయం, కింగ్ జార్జ్ అసుపత్రి మధ్య ఉన్న అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించారు. గురువారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాదరెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. క్రిష్ణమోహన్, కెజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మైథిలిలు సంతకాలు చేసారు. ఎంఓయూలో భాగంగా ఏయూలో ఫార్మ డి చదువుతున్న విద్యార్థులకు కెజిహెచ్ ప్రత్యక్ష శిక్షణ అందించే దిశగా ఉపకరిస్తుంది. గత 12 సంవత్సరాలుగా ఏయూతో అవగాహన ఒప్పందం చేసుకుని కేజీహెచ్లో ఏయూ ఫార్మడి విద్యార్థులకు అవసరమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని జరుగుతోంది.
కార్యక్రమంలో వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ క్యూఎస్ ర్యాంకింగ్ ఏయూ ఫార్యశీ కళాశాల(300-325) విభాగంలో నిలచిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటరు అందించడం, ప్రత్యక్ష జ్ఞానాన్ని విద్యార్థులకు చేరువ చేయడంపై ప్రత్యక్ష ఆసక్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యార్థుల్లో జవాబుదారీతనం పెంపొందించాలన్నారు. ఏయూలో జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల విద్యార్థులను కేజీహెచ్కు ఉపయుక్తంగా నిలుపుతామన్నారు.కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి. క్రిష్ణమోహన్, పాలక మండలి. సభ్యురాలు ఆచార్య క్రిష్ణమంజరి పవార్, ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై. రాజేంద్రప్రసాద్, ఫార్మశీ కళాశాల ఆచార్యులు మురళీక్రిష్ణ, గిరిజాశంకర్, గిరిజాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.