నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు షాక్ తగలింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. రవాణా ఖర్చులు కూడా భారాగా పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ వస్తువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. నెస్లే, హెచ్‌యూఎల్ లాంటి దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మ్యాగీ, సబ్బులు, సర్ఫ్, ఇతర ప్రొడక్ట్స్ ధరల్ని పెంచడంతో సామాన్యాలకు షాక్ తగిలినట్లైంది.
పామాయిల్ ఎగుమతుల్ని ఇండోనేషియా ఎగుమతి చేయడం ఆపేయడంతో ఆ ప్రభావం ఇండియాపై పడింది. దీంతో పామాయిల్ ధరలు కూడా పెరిగాయి. సబ్బులు, షాంపూ, నూడుల్స్, బిస్కట్స్, చాక్లెట్స్‌లో పామాయిల్ ను ఎక్కువగా వాడటం వల్ల ఇప్పుడు వాటి ధరలు కూడా పెరగబోతున్నాయి. వరుసగా ఇలా వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతోంది.