పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని కేబీ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. భాష్యం స్కూలు బస్సు పురుషోత్తమపట్నం అడ్డ రోడ్డు వైపు నుంచి తహసీల్దార్ కార్యాలయం వైపు వెళుతోంది. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న యువకుడు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే సదరు యువకుడి వద్ద సూసైడ్ లెటర్ ఉండటం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.