అమెరికా, యూరప్‌లో సాల్మొనెలోసిస్ అనే కొత్త వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో 150 కంటే ఎక్కువ కేసులు నమోదవ్వడంతో డబ్ల్యుహెచ్ఓ అలర్ట్ అయ్యింది. ఈ వ్యాధి కారణంగా పిల్లలు, వృద్ధులలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ ఆహార తయారీదారు తన ప్లాంట్‌లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలడంతో వారి ఉత్పత్తులను ఆపేసిందని రాయిటర్స్ తన నివేదికలో తెలిపింది.
సాల్మొనెలోసిస్ అనే బాక్టీరియా మనిషి పేగుల మీద ప్రభావం చూపుతుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వ్యక్తి ముట్టుకున్న నీటిని తాగడం, లేదా ఆహారం తినడం వల్ల కలుషిత ఆహారం తిన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి వల్ల జ్వరం, అతిసారం, కడుపు నొప్పి ఉండగా
మరి కొంత మందిలో లక్షణాలేవీ కనిపించవు. తలనొప్పి, జ్వరం. వికారం, వాంతులు, చలి, కంటి నొప్పి, అతిసారం, మలంలో రక్తం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు గుర్తించి ప్రజలకు తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.