చిత్తూరు: చంద్రగిరి పట్టణం జోగలకాలనీలో బావమరిదిపై బావ కత్తితో దాడి చేశాడు. బాధితుడి కథనం మేరకు. జోగలకాలనీకి చెందిన వెంకట రెడ్డి ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అక్క భువనేశ్వరి, బావ మునిరామిరెడ్డి కూడా ఆ కాలనీలోనే ఉంటున్నారు. కుమారుడు విఘ్నేష్ ఎవరితోనే సెల్ఫో న్లో మాట్లాడాడని తండ్రి మునిరామిరెడ్డి చితకబాదాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి అడొచ్చి విడిపించాడు. మునిరామిరెడ్డి తన కుమారుడిని మందలిస్తుండగా వెంకటరెడ్డి కల్పించుకుని రోజూ ఇంట్లో గొడవలు ఏంటని ప్రశ్నించాడు. దీంతో మునిరామిరెడ్డి కత్తితో వెంకటరెడ్డిపై దాడి చేశాడు. కత్తిపోటుకు గురైన వెంకటరెడ్డి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.