టీటీడీ పాలకమండలి భేటి ముగిసింది. ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఇలా ఉన్నాయి.
సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు.
త్వరలో స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి టోకెన్ల పంపిణీ ప్రారంభం.
మే 5 నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు అనుమతి.
ముంబైలో 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మాణం. రూ.500 కోట్లు విలువ భూమి కేటాయించిన మహారాష్ట్ర సర్కార్.
రూ.3.61 కోట్లతో బంగారు సింహాసనాలు ఏర్పాటుకు నిర్ణయం.
పద్మావతి మెడికల్ కాలేజీకి రూ.21 కోట్లు కేటాయింపు.
శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి. మే 5న సీఎం జగన్ తో ప్రారంభం.
వసతి గదుల అభివృద్దికి రూ.19 కోట్లు కేటాయింపు.
ఉద్యోగుల 437 క్వార్టర్స్ రిపేర్లకు అనుమతి.
త్వరలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ.
స్విమ్స్ లో 300 పడకల క్యాన్సర్ విభాగం అభివృద్దికి నిర్ణయం.