ఐపీఎల్-2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు కొద్ది సేపట్లో జరగనుంది. గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఆఢిన 8 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించిన గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు జట్టు తొమ్మిదింటిలో ఐదు గెలిచి, నాలుగు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకునేందుకు డుప్లెసిస్ సారథ్యంలోని బెంగళూరు జట్టు ఇక నుంచి జరిగే మ్యాచ్‌లలో విజయం సాధించాల్సిందే. మ్యాచ్ విన్నర్లు ఇరు జట్లలో ఉన్నారు. వరుస ఓటములతో డీలా పడిన బెంగళూరును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే కోహ్లి సహా కీలక ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది.
గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (తుది జట్టు): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్