దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్లలో ఇదే గరిష్ఠమని తెలిపింది. ఈ ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లు రెండో అత్యధికమని తెలిపింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్ లో రూ.25,000 కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని ఆర్థికశాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa