పెదకూరపాడు మండలం లో వ్యవసాయ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. భూములు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి కౌలు రైతులు ఎవరు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది వ్యవసాయంలో తీవ్ర నష్టం వాటిల్లింది.
అత్యధిక మంది మిరప వేశారు. మిరప ఎకరానికి లక్ష రూపాయలు నష్టం వాటిల్లింది. దీంతో వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి నెలకొని ఉంది. భూ యజమానులు వృద్ధాప్యంతో వ్యవసాయం చేయలేకపోవడం, వారి పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో కౌలు రైతులు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.