సినిమా ప్రమోషన్ల కోసం రోడ్డు పై ఫ్రాంక్ చేసిన హీరో విశ్వక్ సేన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. నడిరోడ్డు పై పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు విశ్వక్ సేన్, మూవీ రివ్యూవర్ లక్ష్మణ్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా ప్రమోషన్ లలో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో వైరల్ అయ్యింది. దీంతో వారి పై ఐపీసీ 268 కింద కేసు పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.