ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవగాహన లేమితో రాష్ట్రాన్ని అప్పుల కుంపటి చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:28 PM

మొగల్తూరు మండలం కేపీ పాలెం (నార్త్), కేపీ పాలెం (సౌత్) గ్రామాల్లో మొగల్తూరు టీడీపీ  మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో  బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించగా నరసాపురం టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు  పాల్గొని ప్రతి ఇంటికి బాదుడే బాదుడు కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి తెల్లారి లెగిస్తే ప్రజలపై పన్నుల భారం వేద్దామని చూస్తున్నాడని తన అవగాహన లేమితో రాష్ట్రాన్ని అప్పుల కుంపటి గా మార్చాడని ధ్వజమెత్తి,  ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు నిజాలు తెలుసుకోవాలని అలానే రాబొయ్యే రోజుల్లో వైసీపీ పార్టీ కి వీడ్కోలు పలికే విధంగా, వారి అన్యాయమైన పరిపాలన విధానాలను, ప్రజల పట్ల వీరు అవలంబిస్తున్న తీరు మంచి పద్దతి కాదని ప్రజలకి వివరించామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa