పామును చూసిన కళ్లకు తాడు చూసినా భయమే.. అన్న చందాన గొలుగొండ మండలంలో ఆదివారం ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలివి. చీడిగుమ్మల గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటల్లో జీడిపిక్కలు సేకరించేందుకు ఉదయం పలువురు రైతులు వెళ్లాను. ఆ తోటలో వారికి ప్లాస్టిక్ డొక్కులో తల చిక్కు కుని గిలగిలా కొట్టుకుంటున్న ఓ కుక్క కనిపించింది. శరీరంపై పులి చారలు వలే కలిగి ఉన్న దానిని కాస్త దూరంగా చూసిన ఆ రైతులు పులి అనుకుని భయాం దోళన చెందారు.
గత రెండు మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తూ.. మూగజీ వాలను సంహరిస్తుండడాన్ని తెలుసుకున్న వీరు అదే భయంలో ఉన్నారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖాధికారులకు ఈ సమాచారం అందించడంతో ఎస్‌ఐ ధనుంజయనాయుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజాబాబు, ఫారెస్టర్ సతీశ్‌లు సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇది పులికాదు కుక్క అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజాబాబు తేల్చారు. ఇదంతా అటవీ ప్రాంతం కావడంతో అంతా అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిం చారు. ఇదిలావుంటే, జనసంచారం అధికం కావడంతో కుక్క పరుగులు తీసింది