ఏపీలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1800 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న ‘నరేగా’ బిల్లుల చెల్లింపు ను వెంటనే చెల్లించేలా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు.
పంచాయతీలకు బిల్లులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఈ నిధులతో నిర్మించే భవనాలను వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని, సిమెంటు కొరత రాకుండా పేదలకు అండగా ఉండాలని తెలిపారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.