ఫిలిప్పీన్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉండడంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.అగ్నిప్రమాదంలో బాధితులు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒకే ఇంట్లో ఉన్న చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. దాదాపు 80 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 250 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa