టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా ప్రజల మీద భారం మోపుతూ.. ప్రజలను ఇబ్బంది పెడుతుందని , ఒక్క మాటలో చెప్పాలంటే , పెట్రోల్ , డీజిల్, కరెంటు బిల్లుల విషయంలో బాదుడే... బాదుడు అని ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ఆరోపించారు. ప్రజలు కూడా ఆయన చెప్పినదానికి బాగానే మద్దతు పలికారు. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో టీడీపీ లో పెంచిన ధరలతో పాటు ఇంటి పన్ను, ఆదాయ పన్ను, చెత్త పన్ను లాంటివి కూడా పెంచడం గమనార్హం. ఈ విషయాన్నీ ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయనే చెప్పాలి. బాదుడే బాదుడు అనే వినూత కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలలోకి వెళ్లాలని టీడీపీ పార్టీ నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ నుండి ఆముదాలవలస వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో దల్లవలస గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారని టీడీపీ నాయకులూ తెలియచేసారు.