రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతున్న తరుణంలో, మొదటగా సీఎం జగన్ చెప్పిన విధంగా మంత్రి పదవులు మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే రోజాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి పదవి వరించింది. రోజా మంత్రి పదవి వచ్చిన సందర్భంలో పలు రాజకీయ నేతలను కలిసి కృతజ్ఞతలు తెలియచేసింది. అలానే కొన్ని పర్యాటక ప్రదేశాలను దర్శించి వాటి అభివృద్ధికి పాటు పడతానని చెప్పడం జరిగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 1670 సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మంత్రి రోజా తెలిపారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ఆడిస్తామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.