జి.కొత్తపల్లిలో గత నెల 30న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్పై జరిగిన దాడి కుట్రపూరితమేనని వైసీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. టీడీపీ వర్గీయులే ఈ దాడి చేసినట్లు కొన్ని ఫొటోలు, వీడియోలను బయటపెట్టింది .జి.కొత్తపల్లి గ్రామ వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ గత నెల 30న హత్యకు గురయ్యాడు. హత్య విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులు.. గ్రూపు రాజకీయాల వల్లే ఈ హత్య జరిగిందంటూ ఎమ్మెల్యే పైకి గ్రామస్తుల్ని ఉసిగొల్పే ప్రయత్నం చేశారన్నారు . చివరకు టీడీపీ నేతలు, కార్యకర్తలే స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో పాటు పోలీసులపై దాడి చేశారన్నారు. ఈ దాడికి ముందు టీడీపీ వర్గీయులు ఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక తోటలో మద్యం సేవించి, దాడికి కుట్ర పన్నినట్లు సమాచారం తమ వద్ద ఉంది అని అవి బయట పెట్టవలసిన సమయంలో పెడతాం అని హెచ్చరించారు.