రాష్ట్రంలో ఉన్న కరెంటు కోతలు, భారీగా పెరిగిన కరెంట్ ఛార్జ్ లు వలన ప్రతి పక్షాలు రోజు ఏదో మూలాన ధర్నాలు , నిరసనలు చెప్పటం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది , దానికి కారణం బొగ్గు కొరతే అని సమాధానం ఇస్తుంది. అలానే గత ప్రభుత్వం చేసిన బకాయిలు చెల్లిచకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది అని కూడా తెలియచేసారు. ఐనప్పటికీ ప్రజలలో కానీ ప్రతిపక్షాలలో కానీ ప్రభుత్వ మాటలను నమ్మాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. తాజా పారిస్తుతుల దృష్ట్యా ... విద్యుత్ శాఖపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమస్యను అధికమించడానికి ఏమి చెయ్యాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.