ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ గురువారం ప్రకటించింది.రాబోయే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఉపఎన్నిక 2022 కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పుష్కర్ సింగ్ ధామికి ఆమోదం తెలిపింది,అంతకుముందు, బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గెహ్టోరీ చంపావత్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి, ధామి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం చేశారు.ఎన్నికల సంఘం ప్రకారం, ఈ స్థానాలకు మే 31న పోలింగ్, జూన్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.