నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వెయ్యాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మనుసిక్ మండియా కి టీడీపీ నాయకులూ నారా లోకేష్ లేఖ వ్రాయడం జరిగింది. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది. మే 21 నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి అన్నిటిని అలోచించి తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా మనవి చేసారు.