చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అక్కడ కఠిన లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయితే కరోనా నిర్మూలన పేరుతో దారుణమైన దాడులు, అధికార దుర్వినియోగం వంటి క్రూరమైన చర్యలకు చైనా ప్రభుత్వం పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా పరీక్షల పేరుతో దాడులు చేయడం, బలవంతంగా శాంపిళ్లు తీసుకోవడం సహా ఇళ్లను ఇనుప రాడ్లతో బంధిస్తోన్న ఘటనలపై చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కరోనా పరీక్షల పేరుతో దాడులు చేయడం, బలవంతంగా శాంపిళ్లు తీసుకోవడం లాంటి చర్యలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.