ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో శంకరమఠంలో ఆదిశంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శారదా అమ్మవారికి విశేష పూజ, కుంకుమార్చన జరిపారు. శంకర మఠం ప్రధానార్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భట్టిప్రోలు శాసన మండలి బ్రహ్మ విద్యాశ్రమంలో భగవద్గీత పారాయణం జరిపారు.
ఈ సందర్భంగా బండి వెంకట్రావు బూర్లే రాజరాజేశ్వరి ప్రవచనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బూర్లే అరుణకుమారి, ఏ. లక్ష్మీ సునీత, దర్శి శశికళ, యండూరి ప్రభ, తూనుగుంట్ల గౌతమి, బొలిశెట్టి జ్యోతి కిరణ్మయి కాళంగి హేమలత తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa