చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గర్భాలయాన్ని శుద్ధి చేసి రాహుకాల సమయంలో సంప్రదాయ రీతిలో అర్చనలు , అభిషేక పూజలు చేపట్టారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ , ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa