తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్‌కు బస్సులో వెళ్తూ ప్రయాణికులు, కండక్టర్ తో ముచ్చటించారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత మెరీనా బీచ్ వద్ద కరుణానిధి స్మారకం వద్ద నివాళులర్పించారు.