రష్యా దాడులతో మేరియుపొల్ నగరం పూర్తిగా ధ్వంసమైందని, అక్కడ శిథిలాలు తప్ప ఆక్రమించుకోవడానికి ఏమీ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్న పౌరులను వేగంగా తరలిస్తున్నామని చెప్పారు. మే9న మేరియు పొల్లో పుతిన్ ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని భావిస్తోందన్నారు. ఆ భూభాగాన్ని తిరిగి తెచ్చుకోవడానికి దౌత్య మార్గాలను ఉపయోగిస్తామని పేర్కొన్నారు.