ఓ కేసులో సహనం కోల్పోయిన లాయర్.. మహిళను కోర్టు ఆవరణలోనే కొట్టాడు. మధ్యప్రదేశ్ షాదోల్‌లో ఈ ఘటన జరిగింది. భర్త నుంచి విడాకుల కోసం భార్య భారతి దరఖాస్తు చేసింది. భరణం కోసం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వాదనల సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భర్త తరఫు వాదిస్తున్న లాయర్ భగవాన్ ఆమెను కోర్టు ఆవరణలోనే కొట్టాడు. పారిపోతుంటే వెంటబడి చితకబాదాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.