ఆడవాళ్లంటే అందం... అందమంటే ఆడవాళ్లు ... ఆడవారి జీవితంలో అందం ముఖ్య పాత్రను పోషిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, గర్భిణీలు వారి ఆరోగ్య పరిస్థితుల వల్ల మరియు సమయం లేకపోవడం వల్ల అందంపై శ్రద్ధను లైట్ తీసుకుంటుంటారు. ప్రెగ్నెన్సీ అనేది ఎంతో అందమైన ప్రయాణం. ఈ క్రమంలో శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల చర్మం పొడిబారడం, యాక్నె, డార్క్ స్పాట్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను ప్రెగ్నెన్సీ సమయంలో అసలు ఉపయోగించకూడదు. సహజపద్ధతిలో చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుందాం...
స్కిన్ కేర్‌లో భాగంగా మంచి నీరు తాగడం ఎంతో అవసరం. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల వరకు మంచి నీరు తాగాలి. దాని వల్ల శరీరంలో ఉండే చెడు ట్యాక్సిన్స్ తొలగిపోతాయి.
స్వీట్ పొటాటో, క్యారెట్స్ మరియు ఆప్రికాట్స్‌ను క్రమంగా ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు మరియు ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.
అజీలైక్ యాసిడ్ బేస్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల యాక్నె మరియు హైపర్ పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో పాటుగా చర్మం ఎంతో కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.
సాధారణంగా వాడే సన్ స్క్రీన్స్‌కు బదులుగా మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్‌ను ఉపయోగించండి. దాంతో మీ చర్మంను యూవీ వంటి హానికరమైన కిరణాల నుండి రక్షించుకోవచ్చు.