సిడబ్ల్యుసి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వల్ల ప్రతి ఒక్క నేతకు మేలు జరిగిందని, ఇప్పుడు పార్టీకి ఆ రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించుకునే అవకాశం, సమయం వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనులు, పార్టీ గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని, కష్టపడాలని సూచించారు. ఇందుకోసం ఈనెల 13, 14 తేదీల్లో రాజస్తాన్‌లో చింతన్ శిబిర్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa