జీవిత భీమా రంగ సంస్థ ఎల్ఐసీపై ప్రజలకు ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఇదిలావుంటే భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పబ్లిక్ ఆఫర్‌కు మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. సంస్థకు చెందిన 16.20 కోట్ల షేర్లను పబ్లిక్‌కు ఆఫర్ చేయగా... 2.95 రెట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. సోమవారంతో ఎల్ఐసీ ఐపీఓ గడువు ముగియగా... 16.20 కోట్ల షేర్లకు ఏకంగా 47.83 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి.
ఎల్ఐసీ ఐపీఓలో బయటి వ్యక్తుల కంటే కూడా సంస్థ పాలసీ హోల్డర్లే టాప్ బిడ్దర్లుగా నిలిచారు. ఓవరాల్‌గా 2.95 రెట్ల ఓవర్ సబ్‌స్క్రిప్షన్ నమోదు కాగా... పాలసీ హోల్డర్ల జాబితాలో ఇది ఏకంగా 6.12 రెట్లు నమోదైంది. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో 1.99 రెట్లతో దిగువ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఏ విభాగంలో చూసినా ఓవర్ సబ్‌స్క్రిప్షన్ నమోదైన ఎల్ఐసీ ఐపీఓ గ్రాండ్ సక్సెస్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.