బంగాళాఖాతంలో అసని తీవ్ర తుపాను అలజడి కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నంకు 350 కి.మీ. గోపాలపూర్ కు 510 కి.మీ., పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
తుఫాన్ ప్రభావంతో కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశముంది. సముద్రం అలజడిగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నందున భారీ వృక్షాలకు, విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండొద్దని తెలిపింది.