వేసవి కాలం కావడంతో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తీవ్ర నీటి సమస్య నెలకొంది. ప్రధానంగా హైస్కూలు కొట్టాలు, నల్లగుట్ట కాలనీలో గత కొన్ని రోజులుగా తీవ్ర నీటి ఎద్దడితో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ ప్రాంతాల కోసం బోర్ వేశారు. ఊరి ప్రక్కనే చెరువు నిండు కుండలా ఉన్నా ఆ బోర్ ఎండిపోయింది. దీంతో కొత్త బోర్ వేయించి సమస్యను పరిష్కరించాలని వారు గ్రామ సర్పంచ్ ని కోరుతున్నారు.