కళ్యాణదుర్గం మండలం కూరాకులతోట గ్రామంలో బాలకృష్ణ అనే రైతుకు చెందిన 300 అరటి చెట్లు రాత్రి కురిసిన గాలి వానకు నెలకొరిగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధిక పెట్టుబడులు పెట్టి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షంతో అరటి చెట్లు నెలకొనడంతో చాలా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన అనిల్ రేకుల షెడ్ వేసుకొని అందులోనే జీవనం గడిపేవారు. అయితే నిన్నటి రోజు కురిసిన గాలి వాన బీభత్సానికి రేకుల షెడ్ కూలిపోవడంతో ఉండడానికి ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని అనిల్ తెలిపారు. అదేవిధంగా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో సర్పంచ్ వీరుపాక్షి గౌడ్ వ్యవసాయ తోటలో గాలి వాన బీభత్సానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నేల కొరకడంతో విద్యుత్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని విరుపాక్షి గౌడ్ తెలిపారు. గాలివాన బీభత్సం వానికి నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.