ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్పందన అనే కార్యక్రమం ద్వారా న్యాయం చెయ్యడానికి పోలీస్ శాఖ నుంచి విన్నూత రీతిలో వెలువడిన పద్దతి. పోలీస్ స్టేషన్ లో , కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కానీ న్యాయం జరగని సమస్యల్లో తక్షణ న్యాయం కోసం నేరుగా జిల్లా నాయకులను కలవడానికి ప్రజలకి దొరికిన ఒక సదవకాశం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జరుపుతుంటారు. ఐతే తాజాగా నిన్న జరిగిన స్పందన కార్యక్రంలో ప్రకాశం జిల్లా నుండి మంత్రిగా ఎన్నికైన ఆదిమలపు సురేష్ అనబడే మంత్రి నా స్థలాన్ని ఆక్రమించాడు అని ప్రకాశం జిల్లా, దరిమడుగు కి చెందిన రంగ లక్షమ్మ పిర్యాదు చేసింది. దీనితో అక్కడ పోలీస్ వారు అందరూ అవాక్కైపోయారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న "స్పందన" కార్యక్రమం చిత్తశుద్ధిని బహిర్గతం చేయాల్సిన సమయం వచ్చింది. స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యేలుమంత్రుల పైనే ఇలాంటి ఆరోపణలు వస్తుంటే ముఖ్యమంత్రి పరిధిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? దాఖలైన అర్జీలపై కలెక్టర్ల స్పందన ఏంటి? మంత్రులపై అభియోగాలు వస్తే రాజీనామాలు చేసే మంచి రోజులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుండి కుటుంబ పార్టీల పుణ్యమా అంటూ ఎప్పుడో కనుమరుగయ్యాయి. కనీసం విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయగలరా? జగన్ గారు అని ప్రశ్నించారు.