గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు రాజంపేట మండలం పులపుత్తూరులోని వరద ముప్పు బాధితులకు పెనుగాలుల బీభత్సం నిలువ నీడ లేకుండా చేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ లో చెయ్యరు ప్రాజెక్టు తెగిపోవడం వల్ల నివాసగృహాలు అన్నీ కొట్టుకుపోయి గుడిసెల్లో ఉంటున్నామని అన్నారు.
ప్రస్తుతము వీస్తున్న పెను గాలుల వల్ల గుడిసెలు నేలమట్టమయ్యాయని ఆందోళన చెందుతున్నారు. ఈ పెను గాలులతో వారు ఉంటున్న పరదా పట్టా గుడిసెలు, రేకులన్నీ లేచి పోయి గూడు లేకుండా చేశాయని అన్నారు.