వర్షాలు ప్రభావం వలన మురికి కాలవలో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని సుండుపల్లి ఎంపిపి రాజమ్మ సూచించారు. ఈ మేరకు ఆమె మండల కేంద్రమైన సుండుపల్లి లో బస్టాండు, పించా రోడ్డు ప్రాంతాలలోని మురికి కాల్వలను కార్యదర్శి సురేష్ బాబు తో కలిసి పరిశీలించారు. పించా రోడ్డులోని శివాజీ నగర్ సమీపంలో సుండుపల్లి, రాయవరం రహదారిలో మడుగు లాగా నీరు నిలిచి ఉన్న వర్షపు నీటి కుంటలు పరిశీలించారు.