విజయనగరం జిల్లా రాజాం లో అసని తుఫాను ప్రభావం వలన అత్యల్ప వర్షపాతం నమోదైంది. అసని తుఫాను ప్రభావంతో జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. పూసపాటిరేగ లో 6. 5 సెంటీ మీటర్లు, గంట్యాడ లో 6. 2, మెంటాడ లో 5. 4, బొండపల్లిలో 4. 8, ఎస్. కోటలో 4. 7, విజయనగరంలో 4. 5, డెంకాడ లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8. 30 నుంచి నేటి ఉదయం 7. 00 గంటల వరకు సగటున 3. 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు అవ్వడం విశేషం. రాజాం, సంతకవిటి మండలాల్లో 2 సెంటీమీటర్ లు, రేగిడి ఆమదాలవలస లో 2. 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, వంగరలో 1. 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.