అసాని తుఫాను ప్రభావంతో ఉండి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా నియోజకవర్గంలోని ఉండి, ఆకివీడు, కాళ్ళ , పాలకోడేరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులు తమ వరి పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. పలు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని ఆర పెడుతున్నారు. మరోపక్క భారీ వర్షాలకు రోడ్లు సైతం ఛీత్త డి గా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కొద్దిపాటి వర్షానికి మరింత అధ్వానంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.