తుఫాను ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు. ఉంగుటూరు మండలం తల్లాపురంలో ధాన్యం కొనుగోలు కాని రైతులతో బుధవారం ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న పలు సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.