ఈనెల 30, 31వ తేదీలలో నిర్వహించబోయే శృంగవరపుకోట గ్రామ దేవత శ్రీ దారగంగమ్మతల్లి పండగను అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆలయ అనువంశిక పూజారి మోపాడ గౌరి నాయుడు పిలుపునిచ్చారు. పండగ సందర్భంగా శృంగవరపుకోట పట్టణం స్థానిక సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనువంశిక పూజారి గౌరినాయుడు మాట్లాడుతూ యస్. కోట పట్టణంలో గ్రామ దేవత పండగను ప్రతి రెండేళ్లకోసారి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. గత రెండేళ్ల క్రితం కరోనా నేపథ్యంలో పండగను నిర్వహించలేకపోయామని తెలిపారు. ఈ ఏడాది పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కృష్ణం నాయుడు, నానిగిరి రమణాజి, డాక్టర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.