శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం స్థానిక కొండడాభాలు సమీపంలో మంగళవారం బొలెరో వాహనం ఆటోను ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గాయపడిన ఆరుగురిని హుటాహుటిన 108 వాహనంలో కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బుధవారం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa