పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై పోలీస్ అధికారులు మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు. నూతన పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటినుండి నాటుసారా తయారీ మరియు సరఫరా వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాల కట్టడిపై జిల్లా ఎస్పీ దృష్టిసారించారు. నిన్న నాగార్జున సాగర్ PS పరిధిలోని హస్నాబాద్ తండా,అచ్చంపేట PS పరిధిలోని సండ్ర తండా( బండ్లమోటుPS పరిధిలోని మన్నేపల్లి తండా,ఈపూరు PS పరిధిలోని చేజేర్ల తండా మరియు క్రోసూరు PS పరిధిలోని హస్నాబాద్ కొండల్లోని ప్రదేశాలలోని నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి 3000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి,50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారు చేయడం,సరఫరా చేయడం,అమ్మడం మరియు తయారు చేసేందుకు సహకరించడం వంటి చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని,వారిపై పీడి చట్టం కూడా ప్రయోగిస్తామని ఎస్పీ హెచ్చరించారు.