సామాన్యుడు సైతం వంటలకు ఎక్కువగా ఉపయోగించేది టమాటానే. దీని ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి అందని ద్రక్షలా మారింది. కుప్పం నియోజకవర్గంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో టమాట పంటలు ధ్వంసం అయ్యింది. ఈ నేపధ్యంలో టమాట ధరలు కొండెక్కాయి.
15 కేజీల టమాట బాక్సు ధర ఏడు వందల రూపాయ నుండి తొమ్మిది వందల రూపాయలు పలుకితోంది. కూరగాయల అంగట్లలో కిలో టమాట 60, 70 రూపాయలు అమ్ముతున్నారు. పదిరోజుల నుండి టమాట ధరలు వేగంగా పెరుగుతుండటంతో టమాట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.