ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి మధుమేహం(డయాబెటిస్) బారిన పడుతున్నారు. ఈ తరుణంలో ఏం తినాలో, ఏం తినకూడదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక శరీరంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసుకుంటూనే, ఆరోగ్యం దెబ్బతినకుండా మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇక టైప్-1, టైప్-2 మధుమేహ బాధితులు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కని ఆరోగ్యం సాధ్యపడుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ప్రధాన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేయవు.
అవకాడోస్‌లో 1 గ్రాము కంటే తక్కువ చక్కెర, కార్బోహైడ్రేట్‌లు, అధిక ఫైబర్ కంటెంట్ ఉంటాయి. కాబట్టి అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మధుమేహాన్ని నివారించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. తరచూ గుడ్లు తింటే, గుండె జబ్బులు దరి చేరవు. గుడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. బీన్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. చిక్కుళ్ళు ఎక్కువగా తీసుకునే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. నట్స్ రుచికరంగానే కాకుండా శరీరంలో సాధారణ వాపును తగ్గిస్తాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవారిపై జరిపిన ఒక అధ్యయనంలో వాల్‌నట్ నూనెను రోజూ వినియోగించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయని తేలింది.