సీఎం జగన్ ఈ నెల 17న కర్నూల్ జిల్లా, ఓర్వకల్లు మండలానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలోని గుమితం తండా గ్రామ సమీపాన గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును పరిశీలించనున్నారని వెల్లడించారు. ఇప్పటికే కలెక్టర్ పి.కోటేశ్వరరావు (Collector), ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఆయా శాఖ అధికారులు సోలార్ ప్రాజెక్టును సందర్శించారు. హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్, నాయకులతో ముఖాముఖి, భారీ గేట్లు, మొదలైన వాటిపై పరిశీలించారు. ముఖ్యమంత్రి 17న ఉదయం 9.34 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా 11 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గుమితం తండాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.30 గంటకు లోకల్ లీడర్లతో (Leaders) సమావేశం అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.35 గంటలకు గ్రీన్‌కో ఐఆర్‌ఈపీఎస్ వద్దకు చేరుకోనున్నారు.