ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. తోలుతు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా 59 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 25 పరుగులు , మార్కస్ స్టోయినస్ 27 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa