ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం వైఎస్ జగన్ రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు సన్నాహాలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన సభ స్థలిని కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన విత్తనాలు నుంచి అమ్మకాల వరకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు.