ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి సమస్యలకు చెక్ పెట్టండిలా !

Life style |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:32 PM

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ కంటి చూపును కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, ఒమేగా-3 ఉండే చేపలను తినాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి.
- ప్రశాంతంగా నిద్రపోవాలి. అలా చేస్తే కళ్లకు కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది. మంచిగా నిద్ర పోతే రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది.
- ఇంటి నుంచి బయటకు వెళ్తే కూలింగ్‌ గ్లాసెస్‌ తప్పనిసరిగా ధరించాలి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు రక్షణనిస్తాయి.
- రోజు మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఎన్నింటినో తాకుతుంటాం. అదే చేతితో కళ్లను తాకకూడదు. అలా చేస్తే బాక్టీరియా కళ్లలోకి చేరుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com