నాణ్యత కలిగిన పొష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేయాలని సీడీపీఓ మద్దమ్మ సూచించారు.సోమవారం మే నెలకు సంబంధించి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం పౌష్టికాహారం గోడౌన్‌కు వెళ్లి కిట్ల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసే పొష్టికాహారం నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండరాదన్నారు. సరుకులను సకాలంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా చిక్కీలు, రాగి, జొన్న పిండి అటుకులు తదితర కిట్ల తూకం, తయారీ తేదీ తదితర వివరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రవీణ్, సూపర్‌వైజర్ సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.