తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు.