పచ్చి వెల్లుల్లితో పోలిస్తే నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి గడ్డలను నిప్పుల్లో కాల్చి నల్ల వెల్లుల్లిని తయారు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లోనూ చేసుకోవచ్చు. వెల్లుల్లి గడ్డలను ఒక ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, రైస్ కుక్కర్‌లో పెట్టి వార్మ్‌లో ఉంచితే చాలు. ఎంత ఉడికితే అంత మంచిది. ఎంత ముదురురంగులోకి వస్తే అంత బలం. మామూలు వెల్లుల్లిలాగే రోజుకు నాలుగైదు రెబ్బలు తినవచ్చు. వీటిలోని పోషక విలువలు అనేక రుగ్మతలను నివారిస్తాయి.
నల్ల వెల్లుల్లి గుండె సంబంధ రుగ్మతలు రాకుండా చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
నల్ల వెల్లుల్లి రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది.
నల్ల వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ వెల్లుల్లి తోడ్పడుతుంది. పచ్చి వెల్లుల్లి కంటే ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని నల్ల వెల్లుల్లి ఇస్తుంది.
నల్ల వెల్లుల్లి యాంటీ డయాబెటిక్ గా కూడా పనిచేస్తుంది. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. మధుమేహం కారణంగా వచ్చే ఇతర రుగ్మతలనూ నివారిస్తుంది.
అల్జీమర్స్, డిమెన్షియాకు నల్ల వెల్లుల్లి అడ్డుకట్ట వేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుందని కూడా ఆయుర్వేద ఆచార్యులు చెబుతుంటారు.